ear phones: 'డ్రైవర్ చెవిలో ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకోవడం వల్లే ప్రమాదం'.. 13 మంది చిన్నారుల మృతిపై యోగి ఆదిత్యనాథ్‌

  • యూపీలోని ఖుషీ నగర్‌ ప్రమాదంపై యోగి స్పందన
  • స్కూల్ వ్యాన్‌ డ్రైవర్‌ ఫోన్‌ మాట్లాడుతున్నాడు
  • క్రాసింగ్‌ వద్ద సెక్యూరిటీ గార్డు సంకేతాలిచ్చాడు
  • డ్రైవర్‌కి వినపడలేదు

ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీ నగర్‌లో పాఠశాల వ్యాన్‌ రైల్వే లెవెల్ క్రాసింగ్‌ వద్ద పట్టాలు దాటుతుండగా ప్రమాదం చోటు చేసుకుని 13 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం ఎందుకు జరిగిందన్న విషయాన్ని వివరించారు. ఆ సమయంలో స్కూల్ వ్యాన్‌ డ్రైవర్‌ ఫోన్‌ మాట్లాడుతున్నాడని, అతడి చెవిలో ఇయర్‌ఫోన్స్‌ కూడా ఉన్నాయని తెలిపారు.

అందువల్లే, క్రాసింగ్‌ వద్ద సెక్యూరిటీ గార్డు సంకేతాలిస్తున్నా డ్రైవర్‌కి వినిపించలేదని వివరించారు. డ్రైవర్‌ పాఠశాల నుంచే ఫోన్‌ మాట్లాడుతూ వ్యాన్‌ నడుపుకుంటూ వచ్చాడని, అయినప్పటికీ సదరు పాఠశాల యాజమాన్యం అతడిని ఎందుకు ప్రశ్నించలేదన్న విషయంపై తాము విచారణ చేపడతామని చెప్పుకొచ్చారు. నిబంధనలు అతిక్రమించినట్లు రుజువైతే ఆ పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని తెలిపారు. 

  • Loading...

More Telugu News