Supreme Court: దేశ చరిత్రలో తొలిసారిగా.. మహిళా న్యాయవాది నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకం!

  • 3 నెలల క్రితం ఐదుగురు సభ్యులు గల కొలీజియం ప్రతిపాదన
  •  ఒకే చెప్పిన సర్కారు 
  • కేఎమ్‌ జోసెఫ్‌ పేరుపై కొనసాగుతోన్న ప్రతిష్టంభన

దేశ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళా న్యాయవాది నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కానున్నారు. మూడు నెలల క్రితం ఐదుగురు సభ్యులు గల కొలీజియం... సీనియర్‌ న్యాయవాది ఇందూ మల్హోత్రా పేరును సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థానానికి ప్రతిపాదించడంతో అక్కడి నుంచి న్యాయశాఖకు, ఆ తర్వాత ఇంటిలిజెన్స్‌ బ్యూరో(ఐబీ)కు ఆమె వివరాలు చేరి, చివరకు సర్కారు అందుకు పచ్చజెండా ఊపింది. ఇందూ మల్హోత్రాతో పాటు కొలిజీయం.. ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేఎమ్‌ జోసెఫ్‌ పేరును కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి సూచించగా, ఆయన నియామకంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది.    

  • Loading...

More Telugu News