Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • వారసత్వంపై కాజల్ కామెంట్ 
  • ఇంటర్వెల్ సీన్స్ చేస్తున్న చరణ్ 
  • 'అ!' దర్శకుడితో రాజశేఖర్ ప్రాజక్ట్ 
  • కొత్తవాళ్లతో రూపొందుతున్న 'హుషారు'

*  హీరోల కొడుకులు హీరోలవడాన్ని చాలా మంది రకరకాలుగా కామెంట్ చేస్తుంటారు. అయితే కథానాయిక కాజల్ మాత్రం ఈ విషయంలో పాజిటివ్ గా స్పందించింది. 'ఎంత హీరోల కొడుకులైనా కష్టపడకపోతే రాణించలేరు. ఇప్పుడు మనకున్న ఆ తరహా హీరోలంతా ఎంతో కష్టపడి నిరూపించుకున్న వారే. వారి కష్టమే వారిని స్టార్ హీరోలను చేసింది' అంటూ చెప్పుకొచ్చింది.
*  రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. ప్రస్తుతం చరణ్ పాల్గొనే ఇంటర్వెల్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇవి సినిమాలో చాలా కీలక సన్నివేశాలని తెలుస్తోంది. ఇందులో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.
*  ఇటీవల 'అ!' చిత్రంతో అందర్నీ ఆకట్టుకున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తన తదుపరి చిత్రాన్ని డాక్టర్ రాజశేఖర్ తో చేయనున్నాడు. ఈ దర్శకుడు వినిపించిన కథ నచ్చడంతో రాజశేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి కల్కి అనే పేరు నిర్ణయించారు.
*  'సినిమా చూపిస్త మామా', 'నాన్ననేను నా బాయ్ ఫ్రెండ్స్' వంటి చిత్రాలను రూపొందించిన దర్శకుడు బెక్కెం వేణుగోపాల్ తన తదుపరి చిత్రాన్ని కొత్త తారలతో తీస్తున్నారు. ఈ చిత్రానికి 'హుషారు' అనే టైటిల్ని నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణ దశలో వుంది.       

  • Loading...

More Telugu News