Indian Railway: వేసవి రద్దీ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు

  • ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణమధ్య రైల్వే
  • మే, జూన్‌లలో వరుసగా రైళ్లు నడపనున్న అధికారులు
  • ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచన
వేసవి రద్దీ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వేసవి సెలవుల కారణంగా ఇప్పటికే రద్దీ పెరిగిందని, ఈ నేపథ్యంలో రద్దీని ఎదుర్కొనేందుకు ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ సదుపాయాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా..

* సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లే స్పెషల్ ట్రైన్ జూలై 1, 8, 15, 22, 29 తేదీలలో ఉదయం 5:30 గంటలకు బయలుదేరుతుంది. అవే రోజుల్లో సాయంత్రం 5:30 గంటలకు తిరిగి విజయవాడ నుంచి బయలుదేరి సికింద్రాబాద్ చేరుకుంటుంది.

* కాకినాడ టౌన్ నుంచి రాయచూర్ వెళ్లే స్పెషల్ మే 1, 3, 8, 10, 15, 17, 22, 24, 29, 31, అలాగే జూన్‌ 5, 7, 12, 14, 19, 21, 26, 28 తేదీలలో కాకినాడ నుంచి మధ్యాహ్నం 3గంటలకు బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో మే 2, 4, 9, 11, 16, 18, 23, 25, 30 తేదీలలో రాయచూర్ నుంచి బయలుదేరి కాకినాడ టౌన్ చేరుకుంటుందని అధికారులు తెలిపారు.

* సికింద్రాబాద్ నుంచి రక్సౌల్ వెళ్లే ప్రత్యేక రైలు జూలై 3, 10, 17, 24, 31 తేదీలలో సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 9:40కి బయలుదేరుతుంది. అక్కడి నుంచి తిరిగి 6, 13, 20, 27, ఆగస్టు 3న మధ్యాహ్నం 12:45 గంటలకు బయలుదేరుతాయి.

* సికింద్రాబాద్ నుంచి బరౌనీ వెళ్లే ప్రత్యేక రైలు జూలై  1, 8, 15, 22, 29 తేదీలలో రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. జూలై 4, 11, 18, 25న బరౌనీ నుంచి బయలుదేరి సికింద్రాబాద్ చేరుకుంటుంది.

 * సికింద్రాబాద్ నుంచి గువాహటి వెళ్లే రైలు జూలై 6, 13, 20, 27 తేదీలలో సికింద్రాబాద్‌ నుంచి ఉదయం 7:30కి సికింద్రాబాద్‌లో బయలుదేరి జూలై 9, 16, 23, 30 తేదీలలో గువాహటి నుంచి బయలుదేరి సికింద్రాబాద్ చేరుకుంటుంది.

 * సికింద్రాబాద్ నుంచి దర్బంగా వెళ్లే రైలు జూలై 3, 7, 10, 14, 17, 21, 24, 28, 31 తేదీలలో సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 10 గంటలకు బయలుదేరుతుంది. జూలై 6, 10, 13, 17, 20, 24, 27, 31 తేదీలలో దర్బంగా నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరుతుంది.   
Indian Railway
secunderabad
special trains

More Telugu News