kim jong un: చరిత్ర సృష్టించిన నార్త్ కొరియా చీఫ్ కిమ్ జాంగ్ ఉన్.. 1953 తర్వాత తొలిసారి దక్షిణ కొరియా సరిహద్దులోకి..!

  • దక్షిణ కొరియా  అధ్యక్షుడు మూన్ జేతో చేతులు కలిపిన కిమ్
  • ఆనందంగా ఉందన్న మూన్
  • పీస్ హౌస్ బిల్డింగ్‌ను సందర్శించిన నేతలు

ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జాంగ్ ఉన్ సరికొత్త చరిత్ర సృష్టించారు. తొలిసారి సరిహద్దు దాటి దక్షిణ కొరియాలో అడుగుపెట్టి ఆ దేశాధ్యక్షుడు మూన్ జేతో చేతులు కలిపారు. రెండు దేశాలను విభజించే సైనిక సరిహద్దు రేఖను దాటిన కిమ్.. మూన్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆయన చేతిని ఆప్యాయంగా అందుకున్న మూన్ ‘‘మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. చారిత్రక సదస్సు ముందు చిరకాల ప్రత్యర్థులు ఇద్దరు శుక్రవారం చేతులు కలపడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొరియా యుద్ధం ముగిసిన 65 ఏళ్ల తర్వాత అంటే 1953 తర్వాత ఇరు దేశాల నేతలు కలుసుకోవడం ఇదే తొలిసారి.

సమ్మిట్ కోసం పన్ముంజోమ్‌లోని ట్రూస్ గ్రామంలో నిర్మిస్తున్న ‘పీస్ హౌస్ బిల్డింగ్’ను ఇద్దరు నేతలు సందర్శించిన అనంతరం కిమ్ తిరిగి సరిహద్దు దాటి స్వదేశంలో అడుగుపెట్టారు. అణ్వాయుధ ప్రయోగాలకు స్వస్తి చెప్పనున్నట్టు కిమ్ ప్రకటించిన తర్వాత జరిగిన అతిపెద్ద డెవలప్‌మెంట్ ఇదేనని నిపుణులు చెబుతున్నారు. రెండు కొరియా దేశాల మధ్య శాంతి నెలకొనడంతో బంధం మరింత బలపడేలా మూన్‌తో కిమ్ హృదయపూర్వక చర్చలు జరుపుతారని ఉత్తర కొరియా అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News