TRS: టీఆర్ఎస్ ప్లీనరీలో చేయనున్న 6 తీర్మానాలు!
- ఘనంగా ప్రారంభమైన టీఆర్ఎస్ ప్లీనరీ
- తొమ్మిది అంశాలపై తీర్మానాలు
- ప్లీనరీకి 15 వేల మంది హాజరవుతారని అంచనా
టీఆర్ఎస్ పార్టీ 17వ ప్లీనరీ సమావేశాలు హైదరాబాద్ శివారు కొంపల్లిలో ఘనంగా మొదలయ్యాయి. 9 గంటల పాటు కొనసాగనున్న ఈ ప్లీనరీలో మొత్తం 6 తీర్మానాలను ఆమోదించనున్నారు. ఆ తీర్మానాలు ఇవిగో.
- దేశ రాజకీయాలపై తీర్మానం - ప్రవేశపెట్టనున్న కె.కేశవరావు
- భారీ పాలన సంస్కరణలపై తీర్మానం - ప్రవేశపెట్టనున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి
- ఇంటింటికీ సంక్షేమంపై తీర్మానం - ప్రవేశపెట్టనున్న రసమయి బాలకిషన్
- మైనార్టీ సంక్షేమంపై తీర్మానం - ప్రవేశపెట్టనున్న షకీల్ అహ్మద్
- వ్యవసాయ విధానంపై తీర్మానం - ప్రవేశపెట్టనున్న రాజేందర్ రెడ్డి
- మౌలిక సదుపాయాల కల్పనపై తీర్మానం - ప్రవేశపెట్టనున్న పద్మా దేవేందర్ రెడ్డి
ఈ ప్లీనరీకి దాదాపు 15 వేల మంది హాజరుకానున్నట్టు సమాచారం. మరోవైపు ప్లీనరీకి వచ్చేవారికి ఏ లోటూ లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. నోరూరించే వంటకాలను సిద్ధం చేశారు. భారీ మొత్తంలో మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు.