kathuva: కథువా ఘటన కేసు విచారణపై స్టే విధించిన సుప్రీంకోర్టు

  • ఈ కేసుపై తదుపరి విచారణ  మే 7 కు వాయిదా
  • అప్పటి వరకు ఎలాంటి విచారణ చేపట్టొద్దు
  • సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు

జమ్మూ కశ్మీర్ లోని కథువా ఘటన కేసు విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసుపై తదుపరి విచారణ మే 7కు వాయిదా వేసింది. అప్పటి వరకు ఎలాంటి విచారణ చేపట్టరాదని ఆదేశించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు పేర్కొంది.

 కాగా, ఈ కేసు విచారణను జమ్మూకశ్మీర్ కోర్టుల్లో చేయవద్దని, చండీగఢ్ కు బదిలీ చేయాలని, సీబీఐకి అప్పగించాలని  బాధితురాలి తండ్రి కోర్టుకు విన్నవించుకున్న నేపథ్యంలోనే ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాగా, ఈ ఏడాది జనవరిలో కథువా జిల్లాకు చెందిన ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి, ఆపై హతమార్చిన సంఘటన  జరిగింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ప్రధాన నిందితులు సహా ఎనిమిది మందిని అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News