rohini: ఐఏఎస్ అధికారిణి రోహిణికి తీవ్ర నిరాశ!
- ప్రభుత్వం బదిలీ చేసిన పదవిలోనే కొనసాగాలన్న హైకోర్టు
- కేసు తదుపరి విచారణ మే 30కి వాయిదా
- కోర్టు ఉత్వర్వులతో నిరాశకు గురైన రోహిణి
కర్ణాటకలోని హసన్ జిల్లా కలెక్టర్ గా ఉన్న తనను బదిలీ చేయడం అన్యాయంటూ ఐఏఎస్ అధికారిని రోహిణి సింధూరి న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక ఉత్తర్వులు ఆమెకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. హెచ్ జీ రమేష్, శ్రీనివాస్ గౌడల ధర్మాసనం ఇటీవలే ప్రాథమిక విచారణ జరిపి, నిన్న తమ తీర్పును ప్రకటించింది. ప్రభుత్వం బదిలీ చేసిన ఉద్యోగ, శిక్షణ శాఖ అధికారిగా బాధ్యతలను స్వీకరించాలంటూ హైకోర్టు ఆదేశించింది. కర్ణాటక ఎన్నికలు ముగిసే వరకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిన పదవిలోనే కొనసాగాలని ఆదేశాలు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను మే 30వ తేదీకి వాయిదా వేసింది.