Red Fort: ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటను దత్తత తీసుకున్న దాల్మియా గ్రూప్!

  • గతేడాది  ‘అడాప్ట్ ఎ హెరిటేజ్’ పథకాాన్ని ప్రారంభించిన కేంద్రం
  • ఇండిగో, జీఎంఆర్‌లను వెనక్కి నెట్టి కాంట్రాక్టు దక్కించుకున్న సిమెంట్ కంపెనీ 
  • దత్తత కాలపరిమితి ఐదేళ్లు
  • మండిపడుతున్న విపక్షలు, చరిత్రకారులు

దేశంలోని చారిత్రక కట్టడాల పరిరక్షణకు ప్రభుత్వం గట్టి చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా వాటిని ప్రైవేటు సంస్థలకు దత్తత ఇస్తోంది. ఇందుకోసం ‘అడాప్ట్ ఎ హెరిటేజ్’ పేరుతో ఓ పథకాన్ని ప్రారంభించింది.  మొట్టమొదటి సారిగా ఢిల్లీలోని చారిత్రక ఎర్ర కోటను దాల్మియా భారత్‌ గ్రూప్‌కు రూ.25 కోట్లకు దత్తత ఇచ్చింది. కోటను దత్తత తీసుకున్న దాల్మియా దాని రక్షణ, నిర్వహణ, పునరుద్ధరణ బాధ్యతలను చూసుకుంటుంది. ఎర్ర కోట కోసం ఇండిగో, జీఎంఆర్, దాల్మియా గ్రూపులు పోటీ పడగా రూ.25 కోట్లతో దాల్మియా గ్రూప్ ఈ కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. కాంట్రాక్టు కాలపరిమితి ఐదేళ్లు.

ఏడాది క్రితమే పర్యాటక శాఖ ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా ఢిల్లీలోని ఎర్రకోట, ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో ఉన్న గండికోట దత్తత కోసం దాల్మియా గ్రూప్‌తో ఎంవోయూ కుదర్చుకున్నట్టు పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు, చరిత్రకారులు మండిపడుతున్నారు. డబ్బులు లేవన్న కారణంతో చారిత్రక కట్టడాల నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం సరికాదని చెబుతున్నారు. అంతకంటే నిధుల సేకరణకు పూనుకుంటే బాగుండేదని అభిప్రాయపడుడుతున్నారు.

  • Loading...

More Telugu News