samsung galaxy 6: ఇన్ఫినిటీ డిస్ ప్లే బరిలోకి శామ్ సంగ్... బడ్జెట్ రేంజ్ లో ఏ6, 6 ప్లస్ ఫోన్లు

  • 18.5:9 యాస్పెక్ట్ రేషియోతో డిస్ ప్లే
  • ఎ6లో ఎక్సినోస్ ప్రాసెస్, 6ప్లస్ లో క్వాల్ కామ్ ప్రాసెసర్
  • ఎ6లో 5.6 అంగుళాల స్క్రీన్, 6ప్లస్ లో 6 అంగుళాల స్క్రీన్

నూతన టెక్నాలజీల విషయమై స్మార్ట్ ఫోన్ కంపెనీలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. 18.5:9 యాస్పెక్ట్ రేషియోతో ఇన్ఫినిటీ డిస్ ప్లే ఉన్న గెలాక్సీ ఎ6, 6 ప్లస్ మోడళ్లను శామ్ సంగ్ తీసుకురానుంది. ఈ ఏడాది చివర్లో శామ్ సంగ్ వీటిని విడుదల చేయనుంది. ఈ విషయాన్ని కంపెనీయే ధ్రువీకరించింది. వీటిలో స్పెసిఫికేషన్ల వివరాలను శామ్ సంగ్ పూర్తిగా బయట పెట్టలేదు. ఎ6లో ఎక్సినోస్ 7870 ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, ఉంటాయని, ఎ6 ప్లస్ లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్ ఉంటాయని మాత్రమే ప్రకటించింది.

కాకపోతే పలు సోర్స్ ల ద్వారా కొందరు స్పెసిఫికేషన్లపై వివరాలు లీక్ చేస్తున్నారు. దీని ఆధారంగా చూస్తే గెలాక్సీ ఎ6 5.6 అంగుళాల హెచ్ డీ+ అమోలెడ్ డిస్ ప్లే, వెనుక 16 మెగా పిక్సల్ కెమెరా, 1.7 ఎఫ్ అపెర్చర్, ముందు కూడా 16 మెగాపిక్సల్ కెమెరా, 1.9 అపెర్చర్, రెండు వైపులా ఫ్లాష్ లైట్ ఉంటాయని సమాచారం. అలాగే, ఎ6 ప్లస్ లో 6 అంగుళాల స్క్రీన్ కూడా ఉంటాయి. వెనుక రెండు కెమెరాల సెటప్ కూడా ఉంటుందని సమాచారం.

  • Loading...

More Telugu News