she: హైదరాబాద్‌లో అమ్మాయిలకు అద్దె ఇళ్లు దొరకని పరిస్థితి!
- ‘నెస్ట్ అవే’ సర్వే
- హైదరాబాద్‌లో మహిళలకు భద్రత ఎక్కువే
- రెంటుకు ఇళ్లు ఇవ్వబోమంటోన్న యజమానులు
హైదరాబాద్‌లో అమ్మాయిలకు రెంట్‌కు ఇళ్లు దొరకడం లేదని ‘నెస్ట్అవే’ ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలింది. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో మహిళలకు భద్రత ఎక్కువే ఉన్నప్పటికీ అద్దెకు ఇల్లు దొరకడం మాత్రం గగనంగా మారింది. అలాగే, అద్దెకు ఎలాగోలా ఇళ్లు దొరికిన ఉద్యోగినులు తమ నెల జీతాల్లో అధిక శాతం ఇంటి అద్దెకే ఖర్చు చేయాల్సి వస్తుందట. ఒంటరి మహిళకు అద్దె ఇల్లు ఇవ్వడానికి ఇంటి యజమానులు నిరాకరిస్తున్నారు.
పలు కారణాలు చెబుతూ వేరే చోట ఇల్లు వెతుక్కోమని ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఈ సర్వే చేయడానికి వేర్వేరు నగరాల్లోని వేర్వేరు ప్రాంతాల్లోని మహిళా ఉద్యోగులను ఎంచుకుని అభిప్రాయాలు తీసుకుని ఈ వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌లో మాదాపూర్, శంషాబాద్, గచ్చిబౌలి ప్రాంతాలలో ఉంటోన్న మహిళా ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. కాగా, సదరు సర్వే ప్రకారం మహిళలకు భద్రత లభిస్తోన్న నగరాల విషయంలో హైదరాబాద్ తరువాతి స్థానంలో పూణె, బెంగళూర్ ఉన్నాయి.