Kalpana Chawla: కల్పనా చావ్లాపై డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసల జల్లు

  • ఆమె రోదసీలోకి వెళ్లిన తొలి భారత సంతతి మహిళ
  • నాసా అనేక పురస్కారాలతో గౌరవించింది
  • కల్పనా చావ్లా బాలికలకు స్ఫూర్తి

భారత సంతతికి చెందిన వ్యోమగామి కల్పనా చావ్లాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసల జల్లు కురిపించారు. ఆమె రోదసీలోకి వెళ్లిన తొలి భారత సంతతి మహిళ అని, 2003లో స్పేస్‌ షటిల్‌ కొలంబియా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆమెను అమెరికా చట్ట సభలతోపాటు నాసా అనేక పురస్కారాలతో మరణానంతరం గౌరవించాయని ఆయన చెప్పారు.

కల్పనా చావ్లా స్పేస్‌ షటిల్‌ తో పాటు వేర్వేరు ప్రయోగాల కోసం అంకిత భావంతో పనిచేశారని ట్రంప్ ప్రశంసించారు. ఆసియా పసిఫిక్‌ ప్రాంతం నుంచి వచ్చి అమెరికానే తమ సొంత దేశంగా మార్చుకున్న వారి కారణంగా తమ దేశం ఎంతో లాభపడిందని అన్నారు. కల్పనాచావ్లా అమెరికా వీర మహిళ అని, లక్షల మంది బాలికల్లో ఆమె స్ఫూర్తి నింపారని అన్నారు. 

  • Loading...

More Telugu News