pollution cities: ప్రపంచంలో అత్యధిక కాలుష్య పట్టణాల్లో టాప్ 14 మన దేశంలోనే
- అత్యధిక కాలుష్య పట్టణంగా యూపీలోని కాన్పూర్
- ఇక్కడ పీఎం 2.5 స్థాయి 173
- యూపీ నుంచే ఐదు పట్టణాలు
- ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు
భారత నగరాల్లో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యం ఉన్న 15 పట్టణాల్లో 14 మన దేశానివి చెందినవే ఉన్నాయి. ఇక్కడి గాలిలో కాలుష్యం పీఎం 2.5 ప్రమాదకర స్థాయిలో నమోదవుతోంది. పీఎం 2.5 అనేది అతి సూక్ష్మమైన కాలుష్య కణాలు. ఇవి గాలి ద్వారా మన ఊపరితిత్తుల్లోకి వెళ్లి తీవ్ర హాని చేస్తాయి.
ఇక ప్రపంచంలోనే అత్యంత కాలుష్య పట్టణాలు, వాటిలో పీఎం2.5 స్థాయిలను గమనిస్తే... తొలి స్థానంలో కాన్పూర్ ఉంది. ఇక్కడి గాలిలో పీఎం 2.5 అనేది 173 స్థాయిలో ఉండి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. 2. ఫరీదాబాద్ (172) 3. వారణాసి (151) 4. గయ (149) 5. పాట్నా (144) 6. ఢిల్లీ (143) 7. లక్నో (138) 8. ఆగ్రా (131) 9. ముజఫర్ పూర్ (120) 10. శ్రీనగర్ (113) 11. గురుగ్రామ్ (113) 12. జైపూర్ (105) 13. పాటియాలా (101) 14. జోధ్ పూర్ (98). ఇక ప్రపంచ కాలుష్య పట్టణాల జాబితాలో 15వ స్థానంలో ఉన్నది కువైట్ లోని అలి సుభా అల్ సలేమ్. ఇక్కడ పీఎం 2.5 94 స్థాయిలో ఉంది. ఇవి ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన గణాంకాలు. 14 కాలుష్య పట్టణాల్లో ఐదు యూపీ నుంచే ఉండడం గమనార్హం.