kota srinivas rao: సినిమా ఆఫీసుల చుట్టూ నేను తిరగలేదు .. అలా నాకు సినిమా ఛాన్స్ వచ్చింది: కోట శ్రీనివాసరావు
- నాటకాలపైనే ఎక్కువ ఆసక్తి ఉండేది
- నా నాటకాన్ని టి.కృష్ణగారు చూశారు
- ఆ తరువాత ఆయన సినిమాలో ఛాన్స్ ఇచ్చారు
కోట శ్రీనివాసరావు ఏ పాత్రను పోషించినా .. ఆ పాత్ర ఒక ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. ఆయన తప్ప మరెవరూ ఆ పాత్రను ఆ స్థాయిలో పండించలేరనిపిస్తుంది. అలాంటి కోట శ్రీనివాసరావు తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన సినీరంగ ప్రవేశం గురించి చెప్పుకొచ్చారు.
"నేను నాటకాలు వేస్తూ వెళుతున్నాను .. ఎప్పుడూ కూడా నాకు నేనుగా నా ఫొటోలు పట్టుకుని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగింది లేదు. నా అదృష్టం బాగుండి 'రవీంద్రభారతి'లో నేను నాటకం వేస్తూ ఉండగా టి. కృష్ణగారు చూశారట. అప్పట్లో ముత్యాల సుబ్బయ్య గారు ఆయన దగ్గర కో డైరెక్టర్ గా ఉండేవారు. ఆ తరువాత టి.కృష్ణగారు 'వందేమాతరం' సినిమా చేస్తున్నప్పుడు, ఒక పాత్రకి రంగస్థలం నటుడైతే బాగుంటుందని ముత్యాల సుబ్బయ్యతో అన్నారట. అప్పుడు ఆయన నా గురించి గుర్తుచేయడంతో పిలిపించారు. అక్కడి నుంచి సినిమా నటుడిగా నా ప్రయాణం మొదలైంది" అని చెప్పుకొచ్చారు.