IRCTC: రేపు రాత్రి నుంచి మూతపడనున్న ఐఆర్సీటీసీ వెబ్ సైట్... వివరాలు!
- గురువారం రాత్రి 10.45 గంటలకు మూత
- ఆరు గంటలకు పైగా మూడపడనున్న వెబ్ సైట్
- వెల్లడించిన ఐఆర్సీటీసీ
నిత్యమూ రైల్వే టికెట్లను రైల్వే మంత్రిత్వ శాఖ అధీకృత వెబ్ సైట్ ఐఆర్సీటీసీ నుంచి బుక్ చేసుకునే లక్షలాది మందికి ఇదో ముఖ్య గమనిక. రేపు... అంటే గురువారం రాత్రి 10.45 గంటల నుంచి ఐఆర్సీసీటీసీ వెబ్ సైట్ మూతపడనుంది. వెబ్ సైట్, యాప్ లను అప్ డేట్ చేసే నిమిత్తం శుక్రవారం ఉదయం 5 గంటల వరకూ అన్ని రకాల సర్వీసులనూ నిలిపివేయనున్నట్టు ఐఆర్సీటీసీ ప్రకటించింది.
ఆన్ లైన్ టికెట్ బుకింగ్ సిస్టమ్ ను మరింత స్నేహపూర్వకంగా మార్చనున్నామని, ఇందులో భాగంగా కొత్త ఫీచర్లు ప్రవేశపెడతామని కూడా సంస్థ తెలిపింది. మొత్తం ఆరు గంటల పాటు ఈ మూసివేత ఉంటుందని, రైల్వే స్టేషన్లలోని ఐవీఆర్ఎస్ టచ్ స్క్రీన్ లతో పాటు కాల్ సెంటర్, 139 విచారణ తదితరాలు కూడా అందుబాటులో ఉండవని, తమ కస్టమర్లు సహకరించాలని కోరింది.