kota srinivas rao: సినిమా రంగంలోకి రావాలనుకునేవారికి కోట శ్రీనివాసరావు సూచన!
- ఎవరైనా సరే సాధన చేయాలి
- సాధన చేయకుండా ఇండస్ట్రీకి వస్తే కష్టమే
- నా అనుభవమే నన్ను నిలబెట్టింది
విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలలో జీవిస్తూ కోట శ్రీనివాసరావు అశేష ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతమైన స్థానం సంపాదించుకున్నారు. అలాంటి కోట శ్రీనివాసరావు తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, సినిమారంగంలోకి రావాలనుకునేవారికి తన అనుభవాన్ని బట్టి ఓ మాట చెప్పారు.
"సినిమా రంగంలోకి నటుడు .. దర్శకుడు .. రచయిత.. అవ్వాలని అడుగుపెట్టేవారికి నేను చెప్పేది ఒక్కటే .. సాధన చేయాలి. సాధన చేయకుండా వచ్చి ఏదో చేసేద్దామనుకుంటే భోజనానికి లాటరీ కొట్టడం తప్పదు. సాధన చేయకపోవడం వలన రాణించలేకపోవడం వేరు. విద్వత్తు వుండి అవకాశాలు రాకపోవడం వేరు. నాకు నాటకానుభవం వుంది కనుక .. ఎలాంటి పాత్రలు వచ్చినా చేస్తూ నిలబడగలిగాను. ఎవరైనా సరే సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నించవద్దు .. సాధన చేయాలి. ఒకరి నటన బాగుందన్నా .. ఒక సినిమా బాగా ఆడిందన్నా దాని వెనుక సాధన జరిగిందని అర్థం" అని చెప్పుకొచ్చారు.