Twitter: పవన్ కల్యాణ్ గారూ... మీ మౌనం దీనిని ప్రోత్సహిస్తున్నట్టుగా వుంది!: గల్లా జయదేవ్ విమర్శలు

  • అభిమానులను నియంత్రించలేకున్నారు
  • వారు విమర్శలకు దిగుతుంటే చూస్తూ ఉన్నారు
  • ట్విట్టర్ ఖాతాలో గల్లా జయదేవ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన అభిమానులను కంట్రోల్ చేయలేకపోతున్నారని తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును పెడుతూ, "పవన్ కల్యాణ్ గారూ... మీపై వ్యక్తిగత విమర్శల దాడి జరిగిందని ఆరోపిస్తూ, మీరు మీడియాపై దాడికి దిగారు. మీ అభిమానులు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. తప్పుడు భాష వాడుతున్నారు. శరీరాకృతిపై మాట్లాడుతున్నారు. కుటుంబ సభ్యులను ప్రస్తావిస్తున్నారు. ఈ విషయంలో మీ మౌనం పరోక్షంగా దీనిని మీరు అంగీకరిస్తున్నట్టు, ప్రోత్సహిస్తున్నట్టుగా అనిపిస్తోంది" అని వ్యాఖ్యానించారు. 

  • Loading...

More Telugu News