Uttar Pradesh: లంచం వద్దన్నందుకు ప్రభుత్వ అధికారిని హత్య చేసిన హోటల్ యజమాని
- మంగళవారం నాడు ఘటన
- అక్రమ భవంతుల కూల్చివేతకు వెళ్లిన షాయిల్ బాలా
- తుపాకితో కాల్చి చంపిన హోటల్ యజమాని
- అరెస్ట్ చేసిన పోలీసులు
అక్రమ భవంతులను కూల్చేందుకు వెళ్లిన ప్రభుత్వ అధికారిణి షాయిల్ బాలా హత్య కేసులో తప్పించుకు తిరుగుతున్న విజయ్ సింగ్ ను యూపీ పోలీసులు మధుర జిల్లాలో అరెస్ట్ చేశారు. ఆపై ఆయన్ను విచారించగా, తన హోటల్ ను కూల్చివేయవద్దని కోరానని, అందుకు లంచం ఇస్తానంటే ఆమె అంగీకరించలేదని, ఆ కోపంతోనే ఆమెను చంపానని అంగీకరించాడు.
మంగళవారం నాడు కసౌలీ పరిధిలోని మందో మాత్కండ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు తన సిబ్బందితో కలసి వెళ్లిన టౌన్ అండ్ కంట్రీ ప్లానర్ షాయిల్ బాలాను విజయ్ సింగ్ తుపాకితో కాల్చి చంపిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.హోటల్ కూల్చివేతకు వచ్చిన సమయంలో షాయిల్ బాలాతో వాగ్వాదానికి దిగిన విజయ్ సింగ్, ఆయన తల్లి
ఘటన తరువాత సమీపంలోని అడవుల్లోకి పారిపోయిన ఆయన, ఓ టాక్సీని అద్దెకు తీసుకుని కసౌలీ నుంచి మధురకు పారిపోయాడు. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఆయన సెల్ ఫోన్ ను ట్రాక్ చేయడంతో పాటు, టాక్సీ డ్రైవర్ ను ప్రశ్నించి అతను ఎక్కడున్నాడన్న విషయాన్ని పసిగట్టారు. బృందావనంలోని బన్కే బిహారీ టెంపుల్ సమీపంలో విజయ్ సింగ్ ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు మెరుపుదాడి చేసి అరెస్ట్ చేశారు.