jeeva: అదే నాకు బాధ కలిగించే విషయం: కమెడియన్ జీవా
- నేను చదువుకున్నది తక్కువే
- ప్రతి ఒక్కరికీ చదువు చాలా అవసరం
- రోజూ అమ్మానాన్నలకు నమస్కరించుకుంటాను
తెలుగు తెరపై విలన్ గాను .. కమెడియన్ గాను విలక్షణమైన నటనను ప్రదర్శించిన నటులలో జీవా ఒకరుగా కనిపిస్తారు. ఎప్పుడు చూసినా ఎరుపెక్కిన కళ్లతో కనిపించే ఆయన, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తూ సుదీర్ఘమైన కెరియర్ ను కొనసాగిస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకి సంబంధించిన విషయాలను పంచుకున్నారు.
"నేను పెద్దగా చదువుకోలేదు .. 11వ తరగతి ఫెయిల్ అయ్యాను. సినిమా పరిశ్రమలో రాణించడానికి .. చదువుకు సంబంధం లేదని అనుకోవద్దు. ప్రతి ఒక్కరికీ చదువు చాలా అవసరం. చదువు జ్ఞానాన్ని ఇస్తుంది .. వివేకాన్ని పెంచుతుంది. నేను సినిమా ప్రపంచాన్ని ఏలేశానని చెప్పనుగానీ .. అందరికీ పరిచయమయ్యాను. నేను ఈ స్థాయికి చేరుకోవడాన్ని నా తల్లిదండ్రులు చూడకపోవడమే నాకు చాలా బాధ కలిగిస్తూ ఉంటుంది. పైలోకంలో వున్న వాళ్లకి, ప్రతి రోజు ఉదయాన్నే నమస్కరించుకుంటూ వుంటాను" అని చెప్పుకొచ్చారు.