rahul gandhi: మీ సీఎం అభ్యర్థి అవినీతిపై 5 నిమిషాలు మాట్లాడగలరా..?: మోదీకి రాహుల్ సవాల్
- రెడ్డి సోదరులకు ఎనిమిది టికెట్లు ఇవ్వడంపై మాట్లాడగలరా?
- మీ మాటలు, చర్యలకు పోలిక ఉండదు
- మోదీని ఏకిపారేసిన రాహుల్ గాంధీ
ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన దాడిని తీవ్రతరం చేశారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో తన ట్విట్టర్ పేజీలో ‘కర్ణాటక మోస్ట్ వాంటెడ్’ పేరుతో ఆయన ఒక వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో మోదీకి ఆయన ఒక సవాల్ విసిరారు. కర్ణాటక బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యెడ్యూరప్ప అవినీతి గురించి, పార్టీకి చెందిన ఇతర అభ్యర్థుల అవినీతి గురించి, రెడ్డి సోదరులకు ఎనిమిది టికెట్లు ఇవ్వడం గురించి కనీసం 5 నిమిషాలు మాట్లాడగలరా అంటూ సవాల్ చేశారు. ‘‘మోదీజీ మీరు ఎంతో మాట్లాడతారు. కానీ సమస్యల్లా మీ చర్యలు మీ మాటలకు సరిపోలవు. మీ కర్ణాటక సీఎం అభ్యర్థి గురించి ఇదొక వీడియో’’ అంటూ అందులో బీఎస్ యడ్యూరప్పపై ఉన్న అవినీతి ఆరోపణల చిట్టా ఉంచారు.

Dear Modi ji,

You talk a lot. Problem is, your actions don’t match your words. Here's a primer on your candidate selection in Karnataka.

It plays like an episode of "Karnataka's Most Wanted". #AnswerMaadiModi pic.twitter.com/G97AjBQUgO
— Rahul Gandhi (@RahulGandhi) May 5, 2018