jeeva: సెల్ ఫోన్ కూడా ఒక వ్యసనంగా మారిపోయింది: కమెడియన్ జీవా

  • అస్తమానం సెల్ ఫోన్లోనే ముఖం 
  • సెల్ లో మాట్లాడుతూనే డ్రైవింగ్ 
  • సెల్ఫీల పిచ్చి అంతా ఇంతా కాదు  

జీవా వాయిస్ .. ఆయన డైలాగ్ డెలివరీ డిఫరెంట్ గా ఉంటాయి. అందువలన ఆయన కామెడీని .. విలనిజాన్ని కలిపి నడిపిస్తుంటారు. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, సెల్ ఫోన్స్ గురించి ప్రస్తావించారు. "సెల్ ఫోన్లు వచ్చి పిల్లల జీవితాలను చెడగొట్టేస్తున్నాయి. ఫోన్ కాల్ వస్తే మాట్లాడటంలో తప్పులేదు. కానీ అస్తమానం దాన్లోనే ముఖం పెట్టేస్తున్నారు" అన్నారు.

"నా ఫోన్లో నేను వినడం .. మాట్లాడటం మాత్రమే చేస్తాను. ప్రొడక్షన్ మేనేజర్లకు కూడా మెసేజ్ లు పెట్టొద్దని చెబుతాను. మెడ వంకరగా పెట్టుకుని సెల్ మాట్లాడుతూ బైక్ పై వెళుతుంటారు .. కారు డ్రైవ్ చేస్తూ సెల్ లో మాట్లాడుతుంటారు. ముందు ఏం జరుగుతున్నది .. వెనకాల ఏం వస్తున్నది పట్టించుకోరు .. ఇక సెల్ఫీల గోల అంతా ఇంతా కాదు. నా దృష్టిలో అన్నిటికంటే అతిపెద్ద దుర్వ్యసనం సెల్ ఫోనే" అని చెప్పుకొచ్చారు.  

  • Loading...

More Telugu News