roja: సగం దుస్తులు వేసుకుని, బూతు డైలాగులు, పాటలకు డ్యాన్సులు చేసే రోజాలాంటి వారి వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి: శోభారాణి
- రోజా గత జీవితం ఏమిటి?
- మనిషి అన్నాక సిగ్గు, లజ్జ ఉండాలి
- చంద్రబాబును విమర్శించే హక్కు ఉందా?
- రోజాను బలి తీసుకోవాలని వైసీపీ అనుకుంటోంది
మనిషి అన్నాక సిగ్గు, లజ్జ ఉండాలని... ఎన్ని జరిగినా వైసీపీ ఎమ్మెల్యే రోజాలో మార్పు రావడం లేదని తెలుగుదేశం నాయకురాలు శోభారాణి మండిపడ్డారు. సాక్షాత్తు ముఖ్యమంత్రిని, హోంమంత్రిని పట్టుకుని 'దద్దమ్మ' అని మాట్లాడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా గత జీవితం ఏమిటని, ఎక్కడి నుంచి ఆమె జీవితం ప్రారంభమైందని అడిగారు. చంద్రబాబును విమర్శించే హక్కు ఆమెకు ఉందా? అని మండిపడ్డారు. రోజాకు రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ అని, ఆమెకు మంచి పదవిని అప్పగించింది చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన పదవికి న్యాయం చేయకపోగా... టీడీపీని వదిలి, 420లంతా కలసి పెట్టుకున్న పార్టీలో చేరి, అక్కడ ఆమె కూడా 420గా మారిందని దుయ్యబట్టారు. రోజా ఎక్కడ అడుగుపెడితే, అక్కడ ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకుందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ నుంచి సస్పెండైన తొలి మహిళా ప్రజాప్రతినిధి రోజా అంటూ ఎద్దేవా చేశారు.
చట్టాలపై ప్రజలకు గౌరవం పెరగాలంటే... రోజాలాంటి వ్యక్తులు ప్రజాజీవితంలో ఉండకూడదని శోభారాణి అన్నారు. జబర్దస్త్ ప్రోగ్రాంలో సగంసగం దుస్తులు వేసుకుని, బూతు డైలాగులు, బూతు పాటలకు డ్యాన్సులు చేస్తోందని విమర్శించారు. జబర్దస్త్ లాంటి ప్రోగ్రాముల వల్లే దాచేపల్లిలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. రోజా చేస్తున్న పనులు షేమ్ ఫుల్ అని అన్నారు.
విధ్వంసాలను సృష్టించేందుకు రోజాను వైసీపీ ఉపయోగించుకుంటోందని శోభారాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విధ్వంసాల్లో రోజాను బలితీసుకోవాలని కూడా ఆ పార్టీ అనుకుంటోందని... ఈ విషయాన్ని రోజా గుర్తించాలని తాను కోరుకుంటున్నానని, హెచ్చరిస్తున్నానని చెప్పారు.