Andhra Pradesh: అంగన్ వాడీ కార్యకర్తలకు తెలంగాణ కంటే రూ. 1000 ఎక్కువిస్తాం: వైఎస్ జగన్

  • కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్
  • జగన్ ను కలిసిన అంగన్ వాడీ కార్యకర్తలు
  • తెలంగాణలో రూ. 10,500 ఇస్తుంటే ఇక్కడ రూ. 7 వేలే ఇస్తున్నారని ఫిర్యాదు
  • తాను వచ్చి వేతనాలు పెంచుతానని జగన్ హామీ

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, తెలంగాణలో ఇస్తున్న వేతనంతో పోలిస్తే రూ. 1000 ఎక్కువ వేతనాన్ని అంగన్ వాడీ కార్యకర్తలకు ఇస్తామని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హమీ ఇచ్చారు. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ప్రజా సంకల్ప పాదయాత్ర చేస్తున్న ఆయన్ను అంగన్ వాడీ కార్యకర్తలు కలసి తమ సమస్యలను విన్నవించగా, జగన్ స్పందించారు.

తమకు మూడు నెలలుగా జీతాలు రాలేదని వారు చెప్పగా, ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తానని, తమ ప్రభుత్వం త్వరలోనే వస్తుందని, పెండింగ్ వేతనాలన్నీ వెంటనే ఇప్పిస్తానని భరోసా ఇచ్చారు. తెలంగాణలో అంగన్ వాడీ కార్యకర్తలకు రూ. 10,500 వేతనం ఇస్తుంటే, ఏపీలో రూ. 7,000 మాత్రమే ఇస్తున్నారని వారు వెల్లడించారు. ఇలాగైతే తాము బతకలేమని వాపోగా, వారికి ధైర్యాన్నిచ్చిన జగన్, సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరించబడతాయని చెప్పారు.

  • Loading...

More Telugu News