chatisgarh: ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల నుంచి 3జీ రకం రైఫిల్స్ స్వాధీనం
- అత్యాధునిక ఆయుధాలు వినియోగిస్తున్న మావోయిస్టులు
- ఈ తరహా ఆయుధాలు విదేశాల్లో తయారవుతాయి
- వెల్లడించిన ఛత్తీస్ గఢ్ పోలీసులు
ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల నుంచి 3జీ రకం రైఫిల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ, మావోయిస్టులు అత్యాధునిక ఆయుధాలు వాడుతున్నారని, ఇటువంటి ఆయుధాలు విదేశాల్లో తయారవుతాయని వెల్లడించారు. ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు వాడిన ఆయుధాలన్నీ విదేశీ ఆయుధాలుగా నిర్ధారించినట్టు చెప్పారు.
మావోయిస్టులకు అత్యాధునిక విదేశీ ఆయుధాలు ఏ విధంగా చేరుతున్నాయనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. కాగా, గత నెలలో ఛత్తీస్ గఢ్ లోని అటవీ ప్రాంతంలో, ఛత్తీస్ గఢ్- తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్లు జరిగాయి. ఆయా ఎన్ కౌంటర్లలో మొత్తం 15 మంది మావోయిస్టులను హతమార్చారు.