letter: తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటుకి మరో ముందడుగు

  • స్థల పరిశీలనకు కేంద్ర సర్కారు కమిటీ
  • కమిటీలో ఐదుగురు సభ్యులు 
  • కేంద్రం నుంచి రాష్ట్రానికి లేఖ

తెలంగాణ‌లో ఎయిమ్స్ ఏర్పాటు ప్ర‌క్రియ వేగ‌వంతమైంది. ఎయిమ్స్ ఏర్పాటు, స్థ‌ల పరిశీలన కోసం కేంద్ర ప్రభుత్వం ఓ క‌మిటీని నియ‌మిస్తుందని, త్వ‌ర‌లోనే ఆ క‌మిటీ రాష్ట్రంలో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు తెలంగాణకు పంపిన ఓ లేఖ‌లో కేంద్ర సర్కారు పేర్కొంది. కొన్ని రోజుల క్రిత‌మే ఎయిమ్స్ ఏర్పాటుకు లైన్ క్లియ‌ర్ చేస్తూ కేంద్ర సర్కారుకి ఎంసీఐ సిఫార‌సు చేయ‌డంతో వెంట‌నే కేంద్ర ప్ర‌భుత్వం దానికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

నిర్ణీత ప‌ద్ధ‌తుల్లో స్థ‌ల ప‌రిశీల‌న‌కు ఒక నిపుణుల క‌మిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ క‌మిటీ త్వ‌ర‌లోనే రాష్ట్రంలో ప‌ర్య‌టించ‌నుంది. రాష్ట్ర ప్ర‌భుత్వం చూపించే స్థ‌లాల‌ను ప‌రిశీలించి అనువైన స్థలాన్ని ఎంపిక చేయనుంది. దీంతో ఎయిమ్స్ ఏర్పాటు మీద రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున జ‌ర‌గాల్సిన ప్ర‌క్రియ‌ను కూడా సాధ్య‌మైనంత వేగంగా పూర్తి చేయాల‌ని తెలంగాణ మంత్రి ల‌క్ష్మారెడ్డి సంబంధిత వైద్యాధికారుల‌ను ఆదేశించారు.

కేంద్ర క‌మిటీలోని సభ్యులు
1. సునీల్ శర్మ, జాయింట్ సెక్రటరీ
2. డా.డీకే శర్మ, మెడికల్ సూపరింటెండెంట్, ఎయిమ్స్, ఢిల్లీ
3. సచిన్ మిట్టల్, డైరెక్టర్, పీఎంఎస్ఎస్‌వై
4. జీపీ శ్రీవాస్తవ, సూపరింటెండింగ్ ఇంజినీర్, ఎయిమ్స్, రాయబరేలి
5. ముకేశ్‌ వాజ్ పేయి, సీనియర్ ఆర్కిటెక్ట్, యూనియన్ హెల్త్ మినిస్ట్రీ

  • Loading...

More Telugu News