vote for note: కోవర్టుగా మారాలంటూ కేటీఆర్ గన్ మెన్ నన్ను బెదిరించాడు: ఓటుకు నోటు కేసుపై మత్తయ్య
- ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరపాలి
- సీబీఐ చేత విచారణ జరిపించాలి
- నాపై కొట్టేసిన కేసును రీఓపెన్ చేయండి
ఓటుకు నోటు కేసును సీబీఐ చేత విచారణ జరిపించాలని గతంలో ఆ కేసులో నిందితుడిగా ఉన్న మత్తయ్య డిమాండ్ చేశారు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ లపై విచారణ జరిపించాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ వివరాలను ఆర్టీఐ ద్వారా కోరినా ఇవ్వలేదని చెప్పారు. స్టింగ్ ఆపరేషన్ చేసిన వీడియోలను మీడియాకు ఎందుకిచ్చారని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తన తమ్ముడి బంధువులను కూడా కొట్టించారని... దానిపై కూడా విచారణ జరిపించాలని అన్నారు. క్రిస్టియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను ఎందుకు బలిపశువు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసులో తనను కోవర్టుగా మార్చేందుకు మంత్రి కేటీఆర్ గన్ మెన్ యత్నించారని... తాను దానికి ఒప్పుకోకపోతే బెదిరించారని చెప్పారు. తనపై కొట్టేసిన కేసును రీఓపెన్ చేయాలని... వాస్తవాలను తెలుసుకోవాలని డిమాండ్ చేశారు.