stock market: నిన్నటి భారీ లాభాలకు నేడు బ్రేక్.. అప్రమత్తంగా వ్యవహరించిన ఇన్వెస్టర్లు
- ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు
- సెన్సెక్స్ 8, నిఫ్టీ 2 పాయింట్లు అప్
- మార్కెట్లపై ప్రభావం చూపిన ట్రంప్ ప్రకటన
నిన్న భారీ లాభాలను సొంతం చేసుకున్న స్టాక్ మార్కెట్లు నేడు ఆ జోరును కొనసాగించలేక పోయాయి. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ట్రేడింగ్ చేయడంతో మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. ఈ ఉదయం ఉత్సాహంగానే మార్కెట్లు ప్రారంభమయ్యాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగానే లాభపడింది. అయితే, ఇరాన్ డీల్ పై మరి కొన్ని గంటల్లో నిర్ణయం ప్రకటిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో... ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 8 పాయింట్లు లాభపడి 35,216 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 2 పాయింట్లు పెరిగి 10,718 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (6.86%), ఇండియన్ బ్యాంక్ (6.28%), గృహ్ ఫైనాన్స్ లిమిటెడ్ (5.63%), ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ (5.54%), బీఈఎంఎల్ లిమిటెడ్ (4.89%).
టాప్ లూజర్స్:
పీసీ జువెలర్స్ (-15.75%), పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ (-8.05%), ట్రైడెంట్ లిమిటెడ్ (-6.64%), వీడియోకాన్ ఇండస్ట్రీస్ (-3.57%), సింజీన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (-3.43%).