tpcc: రైతు బంధు పథకం పెద్ద డ్రామా: దాసోజ్ శ్రవణ్
- సెక్యూరిటీ ఫీచర్స్ లేకుండా కొత్త పాస్ పుస్తకాలు ముద్రిస్తున్నారు
- వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారు
- పోడు భూములు సాగు చేసే రైతులకు పెట్టుబడి సాయం ఎందుకివ్వరు?
తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకం రేపు ప్రారంభం కానుంది. ఈ పథకం ఇంకా ప్రారంభం కాక ముందే కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రైతుబంధు పథకం పెద్ద డ్రామా అని టీపీసీసీ జనరల్ సెక్రటరీ దాసోజ్ శ్రవణ్ ఆరోపించారు. సెక్యూరిటీ ఫీచర్స్ లేకుండా కొత్త పాస్ పుస్తకాలను ప్రింట్ చేస్తున్నారని, రైతుల పేరిట వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
పోడు భూములు సాగు చేసే రైతులకు పెట్టుబడి సాయం ఎందుకివ్వరని ప్రశ్నించిన శ్రవణ్, మిర్చి రైతులను కేసీఆర్ పట్టించుకోలేదని ఆరోపించారు. కాగా, కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో రైతు బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ రేపు ప్రారంభించనున్నారు. రైతులకు కొత్త పాస్ పుస్తకాలను ఆయన అందజేస్తారు. ఈ సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభకు లక్షమంది రైతులు హాజరవుతారని సమాచారం.