archery: జ్యోతి సురేఖ క్షమాపణ చెప్పాల్సిందే.. విషమిస్తున్నఆర్చరీ కోచ్ చెరుకూరి ఆరోగ్య పరిస్థితి

  • జ్యోతి సురేఖకు ఏడేళ్లపాటు శిక్షణ ఇచ్చాను
  • ఇప్పుడామె నన్ను వార్డెన్‌ను చేసింది
  • క్షమాపణ చెప్పుకుంటే ఆత్మహత్య

తనను వార్డెన్ అని అవమానించిన అంతర్జాతీయ ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ, ఆమె తండ్రి సురేంద్ర కుమార్ 24 గంటల్లోగా క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని ఆర్చరీ కోచ్ చెరుకూరి సత్యనారాయణ హెచ్చరించారు. తాను స్థాపించిన ఓల్గా ఆర్చరీ అకాడమీలో ఏడేళ్లపాటు శిక్షణ తీసుకున్న జ్యోతి సురేఖ ఇప్పుడు తనను వార్డెన్‌ను చేసిందని సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.

జ్యోతి సురేఖ, ఆమె తండ్రి క్షమాపణ చెప్పాలన్న డిమాండ్‌తో మంగళవారం ఆయన ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు సత్యనారాయణను ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, అక్కడ ఆయన వైద్యం చేయించుకోవడానికి నిరాకరించారు. బుధవారం రెండో రోజు కూడా తన దీక్షను కొనసాగించారు. మరోవైపు సత్యనారాయణ సతీమణి కృష్ణకుమారి అకాడమీలో చేపట్టిన దీక్ష రెండో రోజుకు చేరుకుంది. సత్యనారాయణ వైద్యానికి నిరాకరించడంతో ఆయన పరిస్థితి విషమిస్తున్నట్టు విజయవాడ ప్రభుత్వాసుపత్రి వైద్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News