Pawan Kalyan: సముద్రం ఒకరి కాళ్ల వద్ద ఎన్నడూ మొరగదు: పవన్ కల్యాణ్
- యువతలో గుండె ధైర్యముంది
- జాతీయ జెండాలో రంగులు మతాలకు ప్రాతినిధ్యం కాదు
- కులమతాల మధ్య చిచ్చుపెట్టే సంస్కృతి పోవాలి
- ఎన్టీఆర్ స్టేడియంలో పవన్ కల్యాణ్
"సముద్రం ఒకరి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు. పర్వతం ఎవరికీ ఒంగి సలామ్ చేయదు. మనమంతా కలిపి పిడికెడు మట్టే కావచ్చు. కానీ, మనం జెండా ఎత్తితే ఉవ్వెత్తున ఎగసిపడే గుండె ధైర్యం, దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే ఆత్మగౌరవ నినాదం రెపరెపలాడుతుంటాయి" అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
కొద్దిసేపటి క్రితం హైదరాబాదు, ఎన్టీఆర్ స్టేడియంలో భారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పవన్, ఆపై ప్రసంగించారు. జాతీయ జెండాలో ఉన్న రంగులు మతాలకు ప్రాతినిధ్యం కానేకాదని వ్యాఖ్యానించారు. కులమతాల మధ్య చిచ్చుపెట్టే సంస్కృతి పోవాలని అన్నారు. యువతలో, విద్యార్థుల్లో దేశభక్తి నిండా ఉందని చెబుతూ, వారితో జాతీయ సమైక్యతా ప్రమాణాన్ని చేయించారు.