katasani rambhoopal reddy: వైసీపీలో చేరిన కాటసానికి పదవినిచ్చిన జగన్
- ఇటీవలే వైసీపీలో చేరిన కాటసాని
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకం
- హర్షం వ్యక్తం చేసిన కాటసాని మద్దతుదారులు
కర్నూలు జిల్లా పాణ్యం నియోజకర్గ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ఇటీవలే బీజేపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు ఆ పార్టీ అధినేత జగన్ సరైన పదవిని ఇచ్చి గౌరవించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయనను పార్టీ అధిష్ఠానం నియమించింది. ఈ నియామకం పట్ల ఆయన అనుచరులు, కార్యకర్తలు, మాజీ కొర్పొరేటర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన అనుచరులు మాట్లాడుతూ, 2019లో వైసీపీ గెలుపే లక్ష్యంగా పని చేస్తామని చెప్పారు.
మరోవైపు, వైసీపీలో కాటసాని చేరికతో నియోజకవర్గంలో విభేదాలు తలెత్తాయి. కాటసాని చేరికను వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, ఆమె భర్త గౌరు వెంకటరెడ్డిలు తిరస్కరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ తమకే ఇస్తానని జగన్ తమకు హామీ ఇచ్చారని చెబుతున్నారు. టికెట్ తనదేనంటూ కాటసాని ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు.