Tollywood: ‘ప్రత్యేకహోదా’పై చిత్ర పరిశ్రమ స్పందించకపోతే తీవ్ర పరిణామాలుంటాయి: సినీ నిర్మాత రవిచంద్ హెచ్చరిక
- ప్రత్యేక హోదా విషయమై చిత్రపరిశ్రమ స్పందించదే?
- ఇరవై నాలుగు గంటల్లోగా పరిశ్రమ పెద్దలు స్పందించాలి
- లేకపోతే తీవ్రపరిణామాలు ఉంటాయి
ఏపీకి ప్రత్యేక హోదా విషయమై చిత్ర పరిశ్రమ స్పందించకపోవడం పట్ల సినీ నిర్మాత యలమంచి రవిచంద్ విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా ఉద్యమంపై 48 గంటల్లోగా స్పందించాలని కోరుతూ ఈ నెల 8న మా అసోసియేషన్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఫిల్మ్ చాంబర్ కు లేఖలు రాశామని చెప్పారు. ఏపీ ప్రజలు కష్టాల్లో ఉంటే పెద్ద నిర్మాతలు, ప్రముఖ నటులు ఎందుకు స్పందించడం లేదని, ఏపీ ప్రభుత్వం నుంచి వినోదపన్ను రాయితీలు పొందుతున్న చిత్ర పరిశ్రమకు ఏడాదికి వెయ్యి కోట్లు వస్తున్నాయని అన్నారు. ఈ విషయమై ఇరవై నాలుగు గంటల్లోగా చిత్ర పరిశ్రమ పెద్దలు స్పందించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని రవిచంద్ హెచ్చరించారు.