apple: యాపిల్ నుంచి త్వరలో క్రెడిట్ కార్డు!
- గోల్డ్ మ్యాన్ శాక్స్ తో భాగస్వామ్యం
- వచ్చే ఏడాది ప్రారంభంలో మార్కెట్ కి
- ఆదాయం పెంచుకునే యత్నాలు
స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్ క్రెడిట్ కార్డు తీసుకొస్తే ఎలా ఉంటుంది? ప్రముఖ అంతర్జాతీయ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు ‘గోల్డ్ మ్యాన్ శాక్స్’ భాగస్వామ్యంతో యాపిల్ వచ్చే ఏడాది ప్రారంభంలో ఓ క్రెడిట్ కార్డు తీసుకురానుంది. ఇటీవలే గోల్డ్ మ్యాన్ శాక్స్ తో భాగస్వామ్యం కూడా కుదుర్చుకుంది. మరింత ఆదాయం పొందే వ్యూహంలో భాగంగా క్రెడిట్ కార్డు వ్యాపారంలోకి అడుగుపెడుతోంది.
దీనివల్ల యాపిల్ ఆదాయాలు మరింత పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ వివరాలను ప్రచురించింది. భారత మార్కెట్లో ఆదాయాలు పెంచుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నట్టు యాపిల్ సీఈవో టిమ్ కుక్ స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే.