kerala: ముందస్తు రుతుపవనాల విషయమై 15 తర్వాత ప్రకటన చేస్తాం: ఐఎండీ
- ముందస్తు రుతుపవనాలపై ప్రచారం జరుగుతోంది
- ఈ నెల 25 నాటికి కేరళ తీరాన్ని తాకుతాయంటూ వార్తలు
- ఐఎండీ డైరెక్టర్ జనరల్ కేజే రమేష్ వివరణ
ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే కేరళ తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ కేజే రమేష్ స్పందించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ, ముందస్తు రుతుపవనాలు వస్తాయంటూ ప్రసారమాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని అన్నారు.
రుతుపవనాలు ఈ నెల 25 నాటికి కేరళ తీరాన్ని తాకుతాయనే వార్తలను తాము ఇంకా ధ్రువీకరించడం లేదని చెప్పారు. ముందస్తు రుతుపవనాల విషయమై ఈ నెల 15వ తేదీ తర్వాత ఓ ప్రకటన చేస్తామని చెప్పారు. కాగా, ఈ నెల 25 నుంచి జూన్ 27 మధ్యకాలంలో దక్షిణాది రాష్ట్రాలు, తూర్పు తీర రాష్ట్రాల్లో సాధారణం కంటే అధిక వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు అంచనా.