Karnataka: కర్ణాటకలోని తుముకూరులో ఉద్రిక్తత!

  • కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పర దాడులు
  • బాదామిలో పోలీస్ స్టేషన్ వద్ద  బాహాబాహీకి దిగిన కార్యకర్తలు
  • గాయపడ్డ కార్యకర్తలు సమీప ఆసుపత్రికి తరలింపు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఊపందుకుంటున్న తరుణంలో తుముకూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్నారు. విజయనగర నియోజకవర్గంలో ఈ రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. బాదామిలో పోలీస్ స్టేషన్ వద్ద ఇరుపార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. గాయపడ్డ కార్యకర్తలను సమీప ఆసుపత్రికి తరలించారు. రెండు పార్టీల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు.

కాగా, హంపినగర్ లో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. తమ మునిసిపల్ కార్పొరేటర్ పై కాంగ్రెస్ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారంటూ బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. కాగా, ఈరోజు ఉదయం పోలింగ్ ప్రారంభమైన తొలి గంటలోనే కొన్ని కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. బెంగళూరులోని రాజాజీనగర్ పోలింగ్ కేంద్రంలో విద్యుత్ పోయింది. కొన్ని బూత్ లలో ఓటర్ల పేర్లు లేకపోవడంతో సదరు ఓటర్లు అసహనానికి గురయ్యారు.

  • Loading...

More Telugu News