Tirumala: వెంకన్న దర్శనానికి 30 గంటలు... గదులు దొరక్క రోడ్లపైనే భక్తులు!
- వేసవి సెలవులు, వారాంతంతో రద్దీ
- ఇప్పుడు వెళితే, రేపు మధ్యాహ్నమే దర్శనం
- నడకదారిలో సైతం రద్దీ
వేసవి సెలవులు, వివిధ పరీక్షల ఫలితాల వెల్లడి, వారాంతం కలసి రావడంతో తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఏడుకొండలపై ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తున్నారు. ఈ ఉదయం శ్రీవారి దర్శనానికి వచ్చి స్లాట్ తీసుకోవాలని భావించే వారికి రేపు మధ్యాహ్నం తరువాత మాత్రమే సమయం కేటాయిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
స్వామి దర్శనానికి 30 గంటల పాటు వేచి ఉండాలని టీటీడీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు అద్దె గదులు దొరకక, భక్తులు షెడ్లు, రోడ్లను ఆశ్రయిస్తున్నారు. నడకదారిలో సైతం తీవ్రమైన రద్దీ నెలకొని ఉంది. వెంకన్న దర్శనం కోసం వేచిచూస్తున్న భక్తులకు అన్నపానీయాలకు ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.