Jagan: జగన్ ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలి: మంత్రి దేవినేని ఉమ డిమాండ్
- ‘పట్టిసీమ’ దండగన్న జగన్ ‘కృష్ణా’ వాసులకు క్షమాపణ చెప్పాలి
- ఆ తర్వాతే పక్క జిల్లా పర్యటనకు వెళ్లాలి
- కరవు కాలంలో 150 టీఎంసీల నీళ్లు ఇచ్చిన పథకం ‘పట్టిసీమ’
గోదావరి-కృష్ణా నదులను అనుసంధానిస్తూ నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం గురించి విమర్శలు చేసిన వైసీపీ అధినేత జగన్ ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలని మంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. ‘పట్టిసీమ’ ఫలాలు ఎలా ఉన్నాయో కృష్ణా జిల్లా పాదయాత్రలో చూసైనా జగన్ వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు.
‘పట్టిసీమ దండగ’ అన్న జగన్, కృష్ణా జిల్లా వాసులకు క్షమాపణ చెప్పాకే ప్రజా సంకల్ప యాత్ర ద్వారా పక్క జిల్లాకు వెళ్లాలని డిమాండ్ చేశారు. కరవు కాలంలో 150 టీఎంసీల నీళ్లు ఇచ్చిన పథకంపై విమర్శలు చేయడం దారుణమని, ‘పట్టిసీమ’ నీటితో చెరువులను నింపగలిగామని అన్నారు.