delhi: ఏపీ బీజేపీలో రెండు గ్రూపులు లేవు: బీజేపీ అగ్రనేత మురళీధర్ రావు

  • పార్టీలో కొత్తవారు, పాతవారు అని ఉండరు
  • కర్ణాటకలో బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ ప్రచారం చేసింది
  • అయినప్పటికీ మా గెలుపు ఖాయం

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణను నియమించడం పట్ల ఎమ్మెల్సీ సోము వీర్రాజు వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.  వైసీపీలోకి వెళ్లేందుకు యత్నించిన కన్నాకు అధ్యక్ష పదవిని ఎలా ఇస్తారని ప్రశ్నించడమే కాకుండా, అధిష్ఠానం తీసుకున్న ఈ నిర్ణయంపై మండిపడుతున్నారు. ఏపీ బీజేపీలో చీలికలు వచ్చాయనే వార్తలు హల్ చేస్తున్న తరుణంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు స్పందించారు.

 ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ బీజేపీలో రెండు గ్రూప్ లు లేవని, పార్టీలో కొత్తవారు, పాతవారు అని ఉండరని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కర్ణాటకలో రేపు వెలువడనున్న ఎన్నికల ఫలితాల గురించి ఆయన ప్రస్తావించారు. కర్ణాటకలో బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ ప్రచారం చేసిందని, అయినప్పటికీ అక్కడ గెలుపు ఖాయమని, శ్రీరాములు లాంటి బలమైన నేతల ద్వారా తాము విజయం సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఓటమి తప్పదని తెలిసిన కాంగ్రెస్ పార్టీ.. ‘దళిత సీఎం’ అంశాన్ని తెరపైకి తెస్తోందని విమర్శించారు. 

  • Loading...

More Telugu News