Karnataka: మరికొద్ది సేపట్లో కర్ణాటక ఓట్ల లెక్కింపు ప్రారంభం.. సిద్ధరామయ్య, యెడ్డీలకు నిరాశేనా?

  • ఫలితాలను బట్టి మారనున్న సమీకరణలు
  • ఏ పార్టీకైనా జేడీఎస్ ‘షరతు’లతో కూడిన మద్దతు
  • పూర్తి మెజారిటీ రాకుంటే ముఖ్యమంత్రి అభ్యర్థుల ఆశలు గల్లంతు

మరికొద్ది సేపట్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఏ ఒక్క పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ రాదని సర్వేలు చెప్పాయి. ఇది రెండు పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థులైన సిద్ధరామయ్య, యడ్యూరప్పలకు శరాఘాతంగా మారింది. హంగ్ వస్తే పరిస్థితి ఏంటన్న దానిపై కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కనుక అతిపెద్ద పార్టీగా అవతరిస్తే జేడీఎస్ మద్దతు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే సిద్ధరామయ్యకు బదులుగా మరొకరికి సీఎం అయ్యే అవకాశం లభిస్తుంది.

ఒకవేళ, బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తే అది కూడా జీడీఎస్ మద్దతునే తీసుకుంటుంది. అప్పుడు యడ్యూరప్పకు బదులుగా అనంతకుమార్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ రెండూ కాకుండా జేడీఎస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తే కాంగ్రెస్ బేషరతుగా మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో కుమారస్వామికి ముఖ్యమంత్రి అయ్యే చాన్స్ లభిస్తుంది.

ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొత్తం 224 స్థానాలకు గాను 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 2640 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

  • Loading...

More Telugu News