Karnataka: కన్నడనాట నరాలు తెగే ఉత్కంఠ... మరో నాలుగు సీట్లలో ఆధిక్యాన్ని కోల్పోయిన బీజేపీ!
- ఈ ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు
- అరగంట వ్యవధిలో నాలుగు చోట్ల తగ్గిన బీజేపీ ఆధిక్యం
- 40 స్థానాలను ఖాయం చేసుకునేలా జేడీఎస్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తరువాత ఈ ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీల్లో నరాలుతెగే ఉత్కంఠను కలిగిస్తోంది. మ్యాజిక్ ఫిగర్ కు బీజేపీ దూరం అవుతుండగా, ఆ స్థానాలను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. అరగంట క్రితం 117 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న బీజేపీ నుంచి ఇప్పుడు మూడు స్థానాలు కాంగ్రెస్ ఆధిక్యతలోకి, ఒక స్థానం జేడీఎస్ ఆధిక్యతలోకి వెళ్లిపోయాయి.
ప్రస్తుతం బీజేపీ 103 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ ఆధిక్యత 77 స్థానాలకు పెరిగింది. జేడీఎస్ 41, ఇతరులు రెండు చోట్ల ముందంజలో ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ అయిన 112 స్థానాలకు ఏ పార్టీ చేరుకోకపోతే, కన్నడ రాజకీయం మరింత రసకందాయంలో పడుతుంది. ఇక ఇప్పటివరకూ విజయం ప్రకటితమైన స్థానాలను పరిశీలిస్తే, కాంగ్రెస్ ఖాతాలో 9, బీజేపీ ఖాతాలో 30, జేడీఎస్ ఖాతాలో 3 స్థానాలుండగా, బీజేపీ 73 చోట్ల, కాంగ్రెస్ 68 చోట్ల, జేడీఎస్ 38 చోట్ల ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది.