karnataka: కర్ణాటకలో విచిత్రం.. ఓట్లు కాంగ్రెస్ కు.. సీట్లు బీజేపీకి!

  • హంగ్ దిశగా కర్ణాటక ఫలితాలు
  • 105 స్థానాల్లో ఆధిక్యతలో బీజేపీ
  • బీజేపీ కన్నా 1.4 శాతం ఎక్కువ ఓట్లు సాధించిన కాంగ్రెస్

కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. హంగ్ దిశగా ఫలితాలు వెలువడుతుండటంతో అన్ని పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం బీజేపీ 105 స్థానాల్లో ముందంజలో ఉండగా కాంగ్రెస్ 78, జేడీఎస్ 37 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నాయి. అయితే, ఓ అంశం ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది.

బీజేపీకి ఎక్కువ స్థానాల్లో ఆధిక్యత వచ్చినప్పటికీ... కాంగ్రెస్ తో పోల్చితే ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం మాత్రం తక్కువే. కాంగ్రెస్ కు 38.1 శాతం ఓట్లు వస్తే, బీజేపీకి కేవలం 36.7 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. కాంగ్రెస్ పై బీజేపీ గెలిచిన స్థానాల్లో ఆ పార్టీ స్వల్ప మెజార్టీని మాత్రమే సాధించడం దీనికి కారణం. మరోవైపు, బీజేపీపై కాంగ్రెస్ గెల్చిన స్థానాల్లో మార్జిన్ ఎక్కువగా ఉంది.   

  • Loading...

More Telugu News