Congress: కాంగ్రెస్ పార్టీ పేరు మార్చుకుంటే మంచిది!: మధ్యప్రదేశ్ సీఎం వ్యంగ్యాస్త్రాలు
- పంజాబ్, మిజోరాం, పుదుచ్చేరి ల్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉంది
- ఆ రాష్ట్రాల పేర్లలోని మొదటి అక్షరాలు వరుసగా ‘పీ’,‘ఎం’, ‘పీ’
- కాంగ్రెస్ పార్టీ పేరును ‘పీఎంపీ’గా మార్చుకోవాలి
ఇప్పటివరకు వెల్లడైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎస్ సీ) తన పేరును మార్చుకోవాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
పంజాబ్, మిజోరాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక, ఆ రాష్ట్రాల్లోని మొదటి ఇంగ్లీషు అక్షరాలు వరుసగా పీఎంపీ అని అన్నారు. ఆ రాష్ట్రాల మొదటి అక్షరాలు కలిసి వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ పేరును ‘పీఎంపీ’గా మార్చుకోవాలంటూ విమర్శించారు. కాగా, ఇప్పటివరకు బీజేపీ 87, కాంగ్రెస్ 55, జేడీ ఎస్ 25, ఇతరులు రెండు స్థానాల్లో విజయం సాధించారు. బీజేపీ 18 స్థానాల్లో, కాంగ్రెస్ 23 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.