savitri: నేను సినిమా హాలుకి వెళ్లి టిక్కెటు కొనుక్కునే పరిస్థితి లేదు .. అందుకే 'మహానటి' చూడలేదు!: జమున

  • సినిమా బాగుందని విన్నాను 
  • దర్శక నిర్మాతలకు ప్రశంసలు 
  • కీర్తి సురేశ్ కి అభినందనలు  

సావిత్రికి .. జమునకి మధ్య ఎంతో అనుబంధం వుంది. అక్కా .. చెల్లి .. అని పిలుచుకునే వాళ్లిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. అలాంటి సావిత్రి జీవితచరిత్రగా తెరకెక్కిన 'మహానటి'కి ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి, ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో జమున ప్రస్తావించారు.

 " సావిత్రి వంటి 'మహానటి' జీవితాన్ని తెరకెక్కించడం సాహసమేనని చెప్పాలి. జనానికి సినిమా బాగా నచ్చే వుంటుంది .. లేకపోతే ఎందుకు చూస్తారు. సావిత్రితో వున్న అనుబంధం కారణంగా ఆమె జీవితంపై సినిమా రావడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. అలాంటి ప్రయత్నాన్ని చేసిన ఈ సినిమా టీమ్ కి .. సావిత్రిగా చేసిన కీర్తి సురేశ్ కి అభినందనలు తెలియజేస్తున్నాను. పూర్వం ఒక కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే .. మా అందరినీ పిలిచి ప్రివ్యూ వేసి చూపించేవారు. ఇప్పుడు ఆ సిస్టమే పోయింది. మీరొచ్చి సినిమా చూశారా? అని అడిగితే నేను ఏం చెబుతాను? నేను సినిమా హాలుకి వెళ్లి టికెట్టు కొనుక్కుని సినిమా చూసే పరిస్థితి లేదుగా" అంటూ నిట్టూర్చారు.       

  • Loading...

More Telugu News