stock market: కర్ణాటకలో తగ్గిన బీజేపీ ఆధిక్యత.. ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు

  • మార్కెట్లపై కర్ణాటక ఫలితాల ఎఫెక్ట్
  • బీజేపీ క్లియర్ మెజార్టీతో ఉన్నప్పుడు 400కు పైగా లాభపడ్డ సెన్సెక్స్
  • హంగ్ రావడంతో నష్టాల్లోకి జారుకున్న సూచీలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి హంగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం ఓట్ల లెక్కింపుకు సంబంధించి తొలి ట్రెండ్స్ లో బీజేపీ దూసుకుపోవడంతో, మార్కెట్లు కూడా అదే రీతిలో దూసుకుపోయాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభపడింది. అయితే మధ్యాహ్నం నుంచి బీజేపీ ఆధిక్యతలో మార్పు వచ్చింది.

చివరకు మ్యాజిక్ ఫిగర్ కంటే దిగువకు వచ్చింది. ఈ క్రమంలో, మదుపరులు లాభాల స్వీకరణకు దిగారు. ఫలితంగా మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. చివరకు ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 13 పాయింట్లు కోల్పోయి 35,544కు పడిపోయింది. నిఫ్టీ 5 పాయింట్లు నష్టపోయి 10,802 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
లాల్ పాథ్ ల్యాబ్స్ లిమిటెడ్ (10.06%), ఎంఫాసిస్ (9.80%), దిలీప్ బిల్డ్ కాన్ లిమిటెడ్ (5.67%), అవెన్యూ సూపర్ మార్ట్స్ (4.31%), సీమెన్స్ లిమిటెడ్ (3.86%).    
 
టాప్ లూజర్స్:
అదానీ ట్రాన్స్ మిషన్ (-10.79%), పీటీసీ ఇండియా ఫైనాన్షియల్  సర్వీసెస్ లిమిటెడ్ (-10.21%), అలహాబాద్ బ్యాంక్ (-8.60%), ఎన్సీసీ (-8.03%), రిలయన్స్ కమ్యూనికేషన్స్ (-7.78%).     

  • Loading...

More Telugu News