Karnataka: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తెలుగు ఓటర్ల షాక్!

  • తెలుగు వారి ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో బీజేపీకి తగ్గిన సీట్ల సంఖ్య
  • రాయ్ చూర్ జిల్లాలో 7 సీట్లలో పోటీ చేసి రెండింటిలో నెగ్గిన బీజేపీ
  • బళ్లారిలో 9 స్థానాల్లో మూడింటిలో గెలిచిన కమలనాథులు
  • చిక్ బళ్లాపూర్, కోలార్ నియోజకవర్గాల్లో ఖాతా తెరవని వైనం 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 104 స్థానాల్లో బీజేపీ విజయం సాధించినప్పటికీ, తెలుగు ఓటర్లు మాత్రం ఆ పార్టీకి షాక్ ఇచ్చారనే చెప్పాలి. తెలుగు వారి ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో బీజేపీకి సీట్ల సంఖ్య తగ్గింది. దీంతో, మ్యాజిక్ ఫిగర్ ను అందుకోలేకపోయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రాయ్ చూర్ జిల్లాలోని 7 సీట్లలో బీజేపీ విజయం సాధించింది కేవలం రెండు స్థానాల్లోనే! కొప్పళ జిల్లాలోని 5 సీట్లలో బీజేపీ దక్కించుకుంది 2 స్థానాలే! అదేవిధంగా, బళ్లారిలో 9 స్థానాల్లో మూడు మాత్రమే బీజేపీ ఖాతాలో చేరాయి. చిక్ బళ్లాపూర్ లోని ఐదు స్థానాల్లో, కోలార్ లో 6 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీకి ఒక్క స్థానమూ దక్కకకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News