Karnataka: ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశమివ్వకపోతే న్యాయ పోరాటమే!: కర్ణాటక కాంగ్రెస్
- సర్కార్ ఏర్పాటుకు కాంగ్రెస్-జేడీఎస్, బీజేపీ పోటాపోటీ!
- మాకు అవకాశం ఇవ్వకపోతే న్యాయ పోరాటం చేస్తాం: కాంగ్రెస్
- జేడీఎస్ లో చీలిక లేదంటున్న కుమారస్వామిగౌడ
కర్ణాటకలో కొత్త ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. కాంగ్రెస్ - జేడీఎస్, బీజేపీ వేటికవే ప్రభుత్వం ఏర్పాటు విషయంలో పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అవకాశం ఇవ్వకపోతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
ఈ సందర్భంగా జేడీఎస్ లో చీలిక లేదని ఆ పార్టీ నేత కుమారస్వామి గౌడ చెబుతున్నారు. కాగా, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కేవలం స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కూడగడితే సరిపోదు. అందుకే, జేడీఎస్ లో చీలిక తెచ్చేందుకు బీజేపీ నేతలు యత్నిస్తున్నట్టు సమాచారం. దీంతో, తమ ఎమ్మెల్యేలు చేజారకుండా కాంగ్రెస్, జేడీఎస్ జాగ్రత్తపడుతున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ లకు చెందిన ఎమ్మెల్యేలను రిసార్ట్స్ కు తరలిస్తున్నట్టు సమాచారం.