gali janardhan reddy: బళ్లారి జిల్లాలో గాలి జనార్దన్ రెడ్డికి ఎదురు దెబ్బ!
- 6 స్థానాల్లో కాంగ్రెస్ విజయం
- 3 స్థానాలకే పరిమితమైన బీజేపీ
- రెండు సీట్లను కోల్పోయిన జనార్దన్ రెడ్డి వర్గం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బళ్లారి జిల్లాలో మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాలు ఉండగా... 6 స్థానాల్లో కాంగ్రెస్ విజయబావుటా ఎగురవేసింది. బీజేపీ కేవలం మూడు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. గాలి జనార్దన్ రెడ్డి దగ్గరుండి, సర్వం తానై నడిపించినప్పటికీ, ఫలితాలు మాత్రం వ్యతిరేకంగానే వచ్చాయి.
బీజేపీ తరపున గెలుపొందిన వారిలో బళ్లారి సిటీ నుంచి గాలి సోమశేఖరరెడ్డి (గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు), సిరిగుప్ప నుంచి సోమలింగప్ప, కూడ్లిగి నుంచి గోపాలకృష్ణలు ఉన్నారు. గత ఎన్నికలతో పోల్చితే గాలి వర్గం రెండు సీట్లను కోల్పోయింది. మరోవైపు బళ్లారి రూరల్, కంప్లి, సండూరు, విజయనగరం (హొస్పేట్), హువ్వినహడగలి, హగరి బొమ్మనహల్లి స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.