Congress: కాంగ్రెస్‌ను చిత్తుచేసిన బీజేపీ ప్లాన్.. సుప్రీంను ఆశ్రయించినా ఫలితం శూన్యం!
- కాంగ్రెస్ కోర్టును ఆశ్రయిస్తుందని ముందే ఊహించిన బీజేపీ
- కోర్టు మూసి, తెరిచేలోగా పని కానిచ్చేయాలని నిర్ణయం
- పక్కాగా అమలు చేస్తున్న బీజేపీ
కాంగ్రెస్ ఎత్తుగడలను ముందే ఊహించిన బీజేపీ కర్ణాటకలో ముందస్తు ప్రణాళికలతో కాంగ్రెస్‌కు కౌంటర్ ఇస్తోంది. కాంగ్రెస్-జేడీఎస్‌లు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని ముందే ఊహించిన బీజేపీ అందుకు అనుగుణంగా పావులు కదిపింది. బుధవారం కోర్టు సమయం ముగిశాక రాత్రి పది గంటలకు ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని గవర్నర్ ఆహ్వానించారు. ఇది తొలి ఎత్తు కాగా, ఉదయం 9:30 గంటలకే ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టడం రెండో ఎత్తు. అంటే కోర్టు మూసి, తెరిచేలోగా చేయాల్సినదంతా చేసేందుకు బీజేపీ పక్కాగా ప్లాన్ రచించింది.
అయితే, బీజేపీని గవర్నర్ ఆహ్వానించడానికి ముందే సుప్రీంను ఆశ్రయించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అభిషేక్ మను సింఘ్వి సహా కాంగ్రెస్ లాయర్లంతా రెడీ అయ్యారు. గవర్నర్ నుంచి లేఖ యడ్యూరప్పకు చేరిన వెంటనే సుప్రీంలో హౌస్ మోషన్ పిటిషన్ వేయాలని భావించారు. అనుకున్నట్టు అర్ధరాత్రి చీఫ్ జస్టిస్ నివాసానికి వెళ్లి, బెంచ్ ముందు వాదనలు వినిపించినా కాంగ్రెస్‌కు మాత్రం ఆశించన ఫలితం లభించలేదు.