bjp: కర్ణాటకలో ప్రజా తీర్పు ఎవరికిచ్చారు...?: అమిత్ షా ప్రశ్న

  • 104 సీట్లు గెలుచుకున్న బీజేపీకా?
  • 78 సీట్లకు పరిమితమైన కాంగ్రెస్ కా?
  • లేక కేవలం 37 సీట్లు తెచ్చుకున్నా జేడీఎస్ కా?

కర్ణాటక రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ కాంగ్రెస్, జేడీఎస్ చేస్తున్న ఆరోపణలకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ అకౌంట్లో ఓ పోస్ట్ పెట్టారు.

‘‘కర్ణాటకలో ప్రజాతీర్పు ఎవరికి ఉంది...?
బీజేపీ 104 సీట్లు గెలుచుకుంది.
లేదా
కాంగ్రెస్ 78 సీట్లకు పడిపోయింది. ఆ పార్టీ సీఎం, మంత్రులు కూడా భారీ మార్జిన్లతో ఓటమి పాలయ్యారు. జేడీఎస్ కేవలం 37 సీట్లలోనే గెలుచుకుంది. పలు సీట్లలో డిపాజిట్లు కూడా కోల్పోయింది. ప్రజలు అర్థం చేసుకోగలరు’’ అని అమిత్ షా ట్వీట్ చేశారు. బీజేపీకి అధికారం ఏర్పాటుకు సరిపడా సంఖ్యాబలం లేకపోయినా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండడాన్ని ప్రజాస్వామ్య ఓటమిగా రాహుల్ గాంధీ అభివర్ణించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News