niharika: మెగా హీరోల గురించి నిహారిక ఏమందంటే .. !
- సక్సెస్ రావాలంటే కష్టపడాలి
- సమస్యలను చిరునవ్వుతో ఎదుర్కోవాలి
- అంకితభావమే స్థాయిని పెంచుతుంది
ఒక వైపున వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంటూనే .. మరో వైపున తెలుగు .. తమిళ సినిమాలపై నిహారిక దృష్టి పెడుతోంది. అలాంటి నిహారిక తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకుంది. మెగా హీరోల్లో ఎవరెవరి నుంచి ఏం నేర్చుకున్నారు? అనే ప్రశ్నకి సమాధానంగా ఆమె ఇలా స్పందించింది.
"మంచి రిజల్ట్ రావాలంటే హార్డ్ వర్క్ చేయవలసిందేననే విషయం చిరంజీవిగారి నుంచి తెలుసుకున్నాను. ఇక ఎలాంటి సమస్యనైనా ఒక చిరునవ్వుతో తరిమేయవచ్చనేది నాన్న నుంచి నేర్చుకున్నాను. యాక్టివ్ గా .. చైతన్యంతో ఉండటం పవన్ కల్యాణ్ నుంచి తెలుసుకున్నాను.
ఫ్యామిలీకి మొదటి ప్రాధాన్యతను ఇవ్వడమనేది చరణ్ నుంచి .. కోపం ఎప్పుడు ఎక్కడ చూపించాలనే విషయాన్ని వరుణ్ తేజ్ నుంచి నేర్చుకున్నాను. మనకంటే చిన్నవాళ్లను ఎలా చూసుకోవాలనేది సాయిధరమ్ తేజ్ ను .. అంకితభావం అనేది అల్లు అర్జున్ ను చూసి తెలుసుకున్నాను. సోషల్ మీడియాలో ఎంతలా యాక్టివ్ గా ఉండాలనేది శిరీశ్ ను చూసి నేర్చుకోవాలి" అని చెప్పుకొచ్చింది.